రెండు వేల గొర్రె తలలను ప్రసాదంగా ఉంచారట!

26 Mar, 2023 19:34 IST|Sakshi

కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్‌, ముంగిసలు మమ్మీలుగా ఉండటం గురించి వినలేదు కదా!. కానీ అమెరికా పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిప్టులో వాటిని కూడా మమ్మీలుగా ఉంచినట్లు గుర్తించారు. జంతువుల మమ్మీలను అమెరికా​ పురావస్తు బృందం దక్షిన ఈజిప్టులోని అబిడోస్‌ నుంచి వెలికితీసింది. అక్కడ దేవాలయాల వద్ద జంతువుల మమ్మీల సమాధులకు ప్రసిద్ధి. కీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఫారో రామ్‌సేస్‌2 అనే రాజు ఈజిప్టుని పాలించాడట. దీంతో ఆయన మరణాంతరం ఆయనకో దేవాలయాన్ని కట్టారు.

అయితే ఆయన మరణించిన వెయ్యేళ్లకు గుర్తుగా ఆయన ఆరాధనలో గొర్రె తలలను అర్పించేవారట. అంటే వేల గొర్రెలను శిరచ్ఛేదనం చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టేవారని పురావస్తు శాఖ సుప్రీం కౌన్సిల్‌ మోస్తఫా వాజిరి తెలిపారు. క్రీ.పూర్వం 2374 నుంచి214 మధ్య కాలం రామ్‌సెస్‌ 2 ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలు, నిర్మాణాలు గురించి తెలుస్తాయని వెల్లడించారు.

అంతేగాదు ఈ ప్రదేశంలో మమ్మీగా చేయబడిన జంతు అవశేషాల తోపాటు దాదాపు 4 వేల ఏళ్లక్రితం నాటి ఐదు మీటర్ల మందం గోడలతో కూడిన ప్యాలెస్‌ అవశేషాలను కూడా కనుగొన్నారు. అక్కడ అనేక విగ్రహాలు, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లను గుర్తించారు. కైరో నదికి దక్షిణంగా నైలు నిదిపై దాదాపు 270 మైళ్ల దూరంలో ఈ​ అబిడోస్‌ ఉంది. ఇక్కడ సేటీ 1 వాటి శవపేటికల ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కైరోలో ఎప్పుడూ ఇలాంటి కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తుండటం విశేషం.

దాదాపు 105 మిలియన్ల మంది నివాసం ఉండే ఈజిప్టు ఆర్థిక సంక్షోబంలో చిక్కుకుంది. అంతేగాదు అక్కడ సుమారు 10 శాతం జీపీడీ పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. పైగా ఇది సుమారు రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే కైరో కరోనా మహమ్మారికి ముందు సుమారు 13 మిలియనల​ మందిని లక్ష్యంగా చేసుకుంటే 2028 నాటికి సుమారు 30 మిలియన్ల మంది టార్గెట్‌గా పెట్టుకుని పర్యాటకాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. 

(చదవండి: ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం)

మరిన్ని వార్తలు