బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు

19 Oct, 2021 04:39 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో దైవదూషణల వార్తల నేపథ్యంలో వారం రోజులుగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆదివారం రాత్రి రంగ్‌పూర్‌ జిల్లా పీర్‌గంజ్‌ ప్రాంతంలోని ఓ గ్రామంలో హిందువులకు చెందిన 66 ఇళ్లను దుండగులు ధ్వంసం చేయడంతోపాటు మరో 20 ఇళ్లను అగ్నికి ఆహుతి చేశారు. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 52 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం భారీగా గాలింపు చేపట్టినట్లు తెలిపారు. తాజాగా, ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ దైవదూషణకు ఉద్దేశించిందంటూ ఆగ్రహంతో కొందరు వ్యక్తులు ఆ గ్రామంపై దాడికి పాల్పడ్డారని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు