భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!

7 Feb, 2023 18:31 IST|Sakshi

టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని  జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి.

దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు.

ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్‌లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు.

అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్‌ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్‌లో సెక్యూరిటీ కాంప్లెక్స్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు.
చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు