ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్‌డ్‌ సర్జరీకి ప్రతీక!

17 Jan, 2022 21:24 IST|Sakshi

2,000-year-old skull of a Peruvian warrior fused together by metal: మన సైన్స్‌ చాలా అత్యధునికంగా అభివృధి చెందింది అని చెబుతుంటాం. పైగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసి మనకు మనమే మురిసిపోతాం. కానీ ఎలాంటి కనీస సదుపాయలు అందుబాటులో లేని పురాతన కాలంలోనే మన పూర్వీకులు అత్యధునిక టెక్నాజీని ఉపయోగించారు అనడానికి ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 

అసలు విషయంలోకెళ్తే... 2,000 సంవత్సరాల నాటి పెరువియన్ యోధుడి పుర్రె లోహంతో కలిసి ఉంది. యూఎస్‌ మ్యూజియంలో ఉ‍న్న ఈ పుర్రెని నాటి అధునాతన శస్త్రచికిత్సకు ఇది ఒక ఉదాహరణ  చెబుతారు. ఆ పుర్రె యుద్ధంలో గాయపడిన పెరువియన్‌ది. పైగా ఆ వ్యక్తికి తలకు పెద్ద గాయం అయ్యిందని, అందువల్ల తలలోని ఎముకలను జాయింట్‌ చేయడానికి ఒక లోహపు (ఐరన్‌ ప్లేట్‌) ముక్కును ఉపయోగించి శస్త్ర చికిత్స చేశారని నిపుణులు చెబుతున్నారు. 

అంతేగాదు ఆ శస్త్ర చికిత్స చేయడం వల్లే ఆ మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అయితే ఆ సమయంలో అనస్థీషియా ఇచ్చారో లేదో అనేది కచ్చితంగా చెప్పలేం అని అన్నారు. పురాతన కాలంలోనే అధునాతన శస్త్రచికిత్సలు చేయగల  నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ పుర్రె ఇప్పుడు కీలకమైన సాక్ష్యంగా పేర్కొనవచ్చు అని ఆస్టియాలజీ మ్యూజియం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఈ శస్త్ర చికిత్సను  ట్రెఫినేషన్‌ అని పిలుస్తారని, పైగా లోహాన్ని కరిగించి పోయేలేదని కూడా  సోషల్‌ మీడియాలో పేర్కొంది. 

(చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి)

మరిన్ని వార్తలు