నార్వేలో టీకా విషాదం.. 23 మంది మృతి

16 Jan, 2021 13:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మృతి

వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారికి వ్యాక్సిన్‌ వద్దు : నార్వే

ఓస్లో‌: నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచించింది. వివరాలు.. ఫైజర్‌ ఎన్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా.. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయన్నారు. (చదవండి: ‘వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం లేదు)

బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు నార్వే అధికారులు. అతి త‌క్కువ జీవిత‌కాలం ఉన్న‌వారు టీకా తీసుకోవడం వల్ల పెద్ద‌గా ప్రయోజనం ఉండ‌ద‌ని.. వారికి టీకా అన‌వ‌స‌రం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్య‌క్తం చేసిం‌ది. ఆరోగ్య‌వంతులు, యువ‌కులు టీకాను తీసుకోవ‌చ్చు అని నార్వే ప్ర‌భుత్వం తెలిపింది. ఇక తమ వ్యాక్సిన్‌ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజ‌ర్ కంపెనీ విచార‌ణ చేప‌డుతున్న‌ది. టీకా వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంద‌ని, తాము ముదుగా అనుకున్న రీతిలో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న‌ట్లు ఫైజ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఇక ఇప్పటి వరకు నార్వేలో వైర‌స్ వ‌ల్ల రిస్క్ ఉన్న సుమారు 33 వేల మందికి టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్ర‌భావం ఉండ‌గా.. దాంట్లో మూడో వంతు మంది 80 ఏళ్లు దాటిన‌వారే ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు