అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 23 నెలల రాణి

8 Jul, 2021 11:38 IST|Sakshi
రాణిని ఫొటోలు తీస్తున్న జనం

ఢాకా : 23 నెలల రాణి అనే ఆవు ప్రస్తుతం సోషల్‌ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది. రాణిని చూడటానికి నిత్యం వేల సంఖ్యలో జనం క్యూ కడుతున్నారు.  జనం అంతలా ఎగబడి చూడ్డానికి రాణిలో అంత ప్రత్యేక ఏంటని అనుకుంటున్నారా? ఆ ఆవు నిజంగానే ప్రత్యేకమైనదే.. 23 నెలల రాణి ఎత్తు 51 సెంటీమీటర్లు మాత్రమే. ఈ మరుగుజ్జు రూపమే దాన్ని సెలెబ్రిటీని చేసింది. బంగ్లాదేశ్‌, ఢాకా దగ్గరలోని చారిగ్రామ్‌కు చెందిన ఎమ్‌ఏ హాసన్‌ హవాల్‌దార్‌ ఈ ఆవును పెంచుకుంటున్నాడు. 51 సెం.మీ ఎత్తు ఉన్న ఈ ఆవు బరువు 26 కేజీలు. ప్రపంచంలో అత్యంత పొట్టి ఆవుగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు కంటే రాణి 10 సెంటీమీటర్లు పొట్టిది.

దీనిపై హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘ కరోనా లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా జనం రాణిని చూడటానికి వస్తున్నారు. చాలా మంది రాణితో సెల్ఫీలు తీసుకోవటానికి ఎగబడుతున్నారు. గత మూడు రోజుల్లో దాదాపు 1500 మంది రాణిని చూడటానికి వచ్చారు. నిజం చెప్పాలంటే వాళ్లను కంట్రోల్‌ చేయలేక మేము అలసిపోయాం. చాలా రోజుల క్రితమే గిన్నిస్‌ రికార్డు వాళ్లను సంప్రదించాం. మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు’’ అని అన్నాడు. 

మరిన్ని వార్తలు