Cancer Awareness Photoshoot: బీచ్‌లో ఒకేసారి 2500 మంది ఫొటో షూట్‌.. ఎందుకో తెలుసా?

26 Nov, 2022 15:04 IST|Sakshi

చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొంత మంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. బీచ్‌లో ఏకంగా 2500 మంది న‌గ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్‌పై ఫోకస్‌ పెట్టాలని పిలుపునిచ్చారు. 

వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్స‌ర్ బాధితులు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో, చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వ‌ద్ద శనివారం ఉద‌యం సుమారు 2500 మంది ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చ‌ర్మ క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న కోసమే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించినట్టు వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

కాగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని అమెరికా ఫొటోగ్రాఫ‌ర్ స్పెన్స‌ర్ టునిక్ ఈ ప్రాజెక్టును చేప‌ట్టారు. అయితే అక్క‌డ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వ‌హించారు. ఇదిలా ఉండగా.. బీచ్‌ల్లో న‌గ్నంగా తిరిగేందుకు ఇటీవ‌లే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో, వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 

మరిన్ని వార్తలు