ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..

30 May, 2023 09:31 IST|Sakshi

ఎవ్వరైన చనిపోతే వారివారి మత ఆచారాలను బ‍ట్టి అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఖననం చేస్తే కొన్ని నెలల్లోనే కుళ్లిపోయి కేవలం అస్థిపంజరాలు మాత్రమే ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. ఐతే ఇక్కడోక ఆఫ్రికన్‌ మహిళ చనిపోయి నాలుగేళ్లైంది. కొన్ని కారణాల రీత్యా ఆమె శవపేటికను వెలికి తీయగా..ఆ మహిళ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే...సదరు మహిళ  సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ ఆ‍ఫ్రికన్‌ అమెరికన్‌. ఆమె అమెరికాలో బెన్‌డిక్ట్‌ ​ఇన్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ మేరి(నన్స్‌ ఆశ్రమం) వ్యవస్థాపకురాలు. అక్కడ ఆమె నన్‌గా ఎంతో సామాజిక సేవ చేసింది. అయితే ఆమె 2019లో చనిపోయింది. అక్కడే ఆ ఆశ్రమం సమీపంలో ఖననం చేశారు. ఐతే  ఆ ఆశ్రమంలోని కొందరూ ఆమె సమాధి పాడవ్వడంతో ఆమె అవశేషాలను వేరోచేటికి తరలించి సమాధి కట్టించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమె శవపేటికను వేలికి తీశారు. అందులో ఆమె మృతదేహం చూసి ఒక్కసారిగా అవాక్యయ్యారు అక్కడున్నవారంతా.

కనీసం ఎలాంటి దుర్వాసన గానీ రాకుండా తాజా మృతదేహంలా అలా చెక్కు చెదరకుండా ఉంది. వాస్తవానికి తాము ఎముకలు మాత్రమే ఉంటాయని భావించామని చెబుతున్నారు ఆమె సంబంధికులు, స్నేహితులు. కనీసం ఆమె మృతదేహం పాడవ్వకుండా ఎలాంటి లేపనాలు పూయకుండా సాధారణ మనిషి మాదిరే ఖననం చేశామని చెబుతున్నారు. పగిలిన శవపేటికలో ఓ తేలికిపాటి మెత్తని పొరలాంటి గుడ్డలో చుట్టబడి, పాడవ్వకుండా ఉన్నా ఆమె మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో సదరు ప్రాంతంలోని ప్రజలు ఆమె మృతదేహాన్ని చూసేందుకు ఆ బెనెడిక్టైన్‌ ఆశ్రమానికి తండోపతండోలుగా తరలి వచ్చారు. 

ఆమె నెక్‌కు ధరించే బెల్ట్‌ మాదిరి క్లాత్‌,  తలకు ధరించిన క్లాత్‌ మాత్రమే పాడైయినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరీం పాక్షికంగా పాడైన చెక్క శవ పేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్‌పోజ్‌ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అంటున్నారు బంధువులు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మరోక చోటికి తరలించి సమాధి చేయనున్నట్లు తెలిపారు ఆమె తల్లి సిసిలియా. ఇది దేవుడి పట్ల ఆమెకి ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడిచ్చిన వరం కాబోలు అని ఆ నన్‌తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు మృతురాలి తల్లి, బంధువులు. 

(చదవండిUS: మితిమీరిన స్వేచ్ఛ+ పతనమైన కుటుంబ వ్యవస్థ = మానసిక ఉన్మాదులు)

మరిన్ని వార్తలు