రష్యా దాడిలో చిన్నారి మృతి.. మిన్నంటిన తండ్రి రోదనలు

18 Jul, 2022 07:13 IST|Sakshi

కీవ్‌: రష్యా యుద్ధకాంక్షకు బలైన తన చిన్నారి పాపాయి మృతదేహాన్ని చూస్తూ గుండెలవిసేలా రోదించాడు ఓ తండ్రి. ఆ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఉక్రెయిన్‌లోని వినిట్సియా సిటీలో గురువారం ఈ చిన్నారిని ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రష్యా సేనలు బాంబులతో దాడిచేశాయి. చిన్నారితో పాటు 24 మంది దుర్మరణం పాలవగా తల్లి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది!

ఇదీ చదవండి: బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు

మరిన్ని వార్తలు