లక్షణాల్లేవు.. కరోనా అంతానికి అదే కీలకం

9 Aug, 2020 11:02 IST|Sakshi

కాలిఫోర్నియా : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కొంతమందికి స్పల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. దాదాపు 40 శాతం కరోనా రోగులకు లక్షణాలు కనిపించడం లేదని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ పేర్కొంది. బోస్టన్ నిరాశ్రయుల ఆశ్రయంలో దాదాపు 147 మందికి కరోనా సోకితే.. 88 శాతం మందికి లక్షణాలే లేవని తమ పరిశోధనలో తేలిందని మోనికా గాంధీ పేర్కొన్నారు.ఆర్క్‌లోని స్ప్రింగ్‌డేల్‌లోని టైసన్ ఫుడ్స్ పౌల్ట్రీ ప్లాంట్‌లో 481 మంది కరోనా బారిన పడితే.. 95 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని తేలింది. అర్కాన్సాస్, నార్త్ కరోలినా, ఒహియో మరియు వర్జీనియాలోని జైళ్లలోని 3,277 ఖైదీలు కోవిడ్‌ బారిన పడగా.. 96శాతం మందిలో ఒక్క లక్షణం కూడా కనిపించలేదు.(రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు)

తీవ్ర లక్షణాలు కనిపించిన వారితో కలిసి ఉన్నవారిలో కొంతమందికి కరోనా సోకలేదు. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్లే వీరికి కోవిడ్‌ సోకలేదా? లేదా కరోనా వైరస్‌ మోతాదులో తేడా వల్ల వీరు కోవిడ్‌ బారిన పడలేదా అనేది మిస్టరీగా మారింది. అయితే ఈ మిస్టరీని చేధిస్తే టీకా లేదా వ్యాక్సిన్‌ అభివృద్ధిని వెగవంతం చేయవచ్చని గాంధీ అభిప్రాయపడ్డారు. అలాగే రోగ నిరోధక శక్తికి కొత్త మార్గాలు సృష్టించవచ్చని చెప్పారు. ఈ దశగా  పరిశోధనలు సాగిస్తే కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే కాకుండా దానిని నాశనం చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా అధిక శాతం మందికి కరోనా లక్షణాలు కనిపించకపోవడం మంచి పరిణామం అని, సమాజానికి ఇది మంచి విషయం అని గాంధీ అభిప్రాయపడ్డారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు