విమానంలో క్వీన్‌ మృతదేహాన్ని మోసుకెళ్లి....

14 Sep, 2022 11:16 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్‌ సెప్టెంబర్‌ 8న స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని రాణి అధికారిక నివాసం రుడ్‌హౌస్‌ ప్యాలెస్‌కు తరలించారు. తదనంతరం విమానంలో లండన్‌కి తరలిస్తారు. ఇది ఆమె చివరి ఫ్లైట్‌ జర్నీగా చెప్పవచ్చు.

ఈ మేరకు విమాన ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లైట్‌ రాడార్‌24 ద్వారా బోయింగ్‌ సీ17 విమానంలో ఆమె భౌతిక దేహాన్ని తీసుకువెళ్తున్న చివరి ప్రయాణాన్ని అత్యధిక మంది ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేకాదు ఎడిన్‌బర్గ్‌ విమానాశ్రయంలో బోయింగ్‌ సీ17ఏ ఎగరడానికి సిద్ధంగా ఉన్న మొదటి నిమిషంలోనే సుమారు 6 మిలియన్ల మంది విమానాన్ని ట్రాక్‌ చేయడానికి ప్రయత్నించారు.

బోక్‌ అర్గోనాట్‌ అటలాంటాలో క్వీన్‌గా ఆమె తొలి ఫైట్‌ ప్రయాణానికి 70 సంవత్సరాల తర్వాత క్వీన్‌ ఎలిజబెత్‌ 2 చివరి విమానమే చరిత్రలో అత్యధికాంగా ట్రాక్‌ చేయబడిన విమానం. అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ తైవాన్‌ వివాదాస్పద పర్యటనను ఫ్లైట్‌ రాడార్‌24 వెబ్‌సైట్‌లో ట్రాక్‌ చేసిన దానికంటే రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ల ఎక్కువ అని పేర్కొంది. 

(చదవండి: ఎలిజబెత్‌ కోట బయట ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్‌)
 

మరిన్ని వార్తలు