రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్‌

1 Jul, 2022 11:50 IST|Sakshi

$45 Million Investment Fraud: నీల్‌ చంద్రన్‌ అనే భారత సంతతి అమెరికన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపింది. చంద్రన్‌ తన కంపెనీలలోని  పెట్టుబడుదారులకు అధిక ఆదాయం వస్తుందంటూ తప్పుడూ ఆధారాలను చూపి సుమారు 10 వేలమందిని మోసం చేశాడని పేర్కొంది.

నేరారోపణ ప్రకారం..."తన కంపెనీలలోని ఒకటి లేదా రెండు కంపెనీలను 'ViRSE' అనే బ్యానర్‌తో నిర్వహిచడమేక కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా చూపించే సాంకేతిక కంపెనీలను చంద్రన్‌ కలిగి ఉన్నాడు. పైగా ఈ కంపెనీలు సంపన్న కొనుగొలుదారుల కన్సార్టియం ద్వారా కొనగోలు చేయబడుతోందంటూ తప్పుడు సాక్ష్యాలు చూపాడు. వాస్తవానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడుదారలకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రన్‌ కంపెనీలో అలాంటి సంపన్న కొనుగోలుదారులు ఎవరు లేరు. చంద్రన్‌ పై మూడు ఫ్రాడ్‌ కేసులు, అక్రమంగా పొందిన ఆస్తిలో లావాదేవీలు జరిపినందుకుగానూ అదనంగా మరో రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఈ చంద్రన్ పై మోపబడిన ఈ అబియోగాలు రూజువైతే మూడు ఫ్రాడ్‌ కేసుల్లో ఒక్కొక్క ఫ్రాడ్‌ కేసుకి 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష , అలాగా అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కొక్క కేసుకి 10 ఏళ్లు చొప్పున శిక్ష పడుతుందని  అమెరికా న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు చంద్రన్‌ వద్ద ఉన్న 39 టెస్లా వాహనాలతో సహా 100 వేర్వేరు ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేట్ తదితర ఆస్తులు మోసాలు ద్వారా సంపాదించిన ఆస్తులుగా జప్తు చేయబడతాయని స్పష్టం చేసింది. 

(చదవండి: పాక్‌లో ఇంటర్నెట్‌ బంద్ హెచ్చరికలు‌! కారణం ఏంటంటే..)

మరిన్ని వార్తలు