ల‌క్ష‌మంది నెటిజ‌న్లు ఫిదా, ఏముందా ఆ వీడియోలో!

29 May, 2021 13:38 IST|Sakshi

ధీరుడు ఒకేసారి మ‌ర‌ణిస్తే..పిరికి వాడు క్ష‌ణం క్ష‌ణం మ‌ర‌ణిస్తాడ‌న్నా వివేకానందుడి సూక్తులు నేటి యువ‌త‌కు ఎంతో ఆద‌ర్శం. కెర‌టం నాకు ఆద‌ర్శం.. లేచి ప‌డినందుకు కాదు.. ప‌డి లేచినందుకంటారు. పోటీ ప‌రీక్ష‌లైనా, అనుకున్న ల‌క్ష్య సాధ‌నే అయినా  ఆశావాహులు అనుకున్న ల‌క్ష్యాల్ని సాధించే క్ర‌మంలో మ‌హ‌నీయుల సూక్త‌ల్ని స్మ‌రిస్తుంటారు. కానీ ఆచ‌ర‌ణలోనే త‌డ‌బ‌డుతూ ల‌క్ష్య సాధ‌న‌లో చ‌తికిల ప‌డుతుంటారు. అలాంటి వారు గమ్యం చేరే వ‌ర‌కు విస్మ‌రించొద్దని అంటున్నాడు ఓ ఏడేళ్ల బుడ్డోడు.    మొద‌టి ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మైనా మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నించి విజ‌యం సాధించవ‌చ్చ‌ని ఓ ఫీట్ ను చేసి చూపించాడు.  ప్ర‌స్తుతం ఆ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. 

ఐఏఎస్ అధికారి ఎంవీ రావు షేర్ చేసిన వీడియోలో బుడ్డోడు ఓ పోల్ ను ఎక్క‌డానికి అనేక సార్లు ప్ర‌య‌త్నిస్తాడు. టార్గెట్ రీచ్ కాలేకపోతాడు.  ఇలా ప‌లు మార్లు ట్రై చేసి చివరికి విజ‌యం సాధిస్తాడు. ఆ వీడియోను ఎంవీ రావు షేర్ చేస్తూ జీవితంలో ప‌ట్టుద‌ల చాలా ముఖ్యం. అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించే వ‌ర‌కు విస్మ‌రించ‌ని ఈ బుడ్డోడే నా గురువు అని ట్వీట్ లో పేర్కొన్నారు.
 
ప్రస్తుతం ఆ చిన్నారి వీడియోను ల‌క్ష‌మందికి పైగా వీక్షించారు. వేలాది మంది ఆ చిన్నారి సాధించిన ఫీట్ కు ఫిదా అవుతున్నారు. మీరూ విజయవంతమయ్యే వరకు మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రయత్నించండి  అంటూ రీట్వీట్ చేస్తుంటే.. ఏం ఫీట్ రా బాబు అంటూ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం ల‌క్షమందికి పైగా నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న వీడియోను మీరూ చూడండి. కాగా, ఇక ఈ ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ పేరు హుస్సేనీ. ఇరాన్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌, సోష‌ల్ మీడియా ఇన్ఫ్యూయ‌న్స‌ర్. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు త‌న ఆట‌తో,ఆట‌లోని ఫీట్ల‌తో ఆక‌ట్టుకోవ‌డంలో దిట్ట‌.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు