ప్రపంచ దేశాధినేతల్లో టాపర్‌గా ప్రధాని మోదీ

5 Sep, 2021 17:03 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ రేటింగ్‌ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ డేటా ప్రకారం.. 13 మంది గ్లోబల్ లీడర్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక రేటింగ్ కలిగి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రాడోర్‌  64శాతంతో రెండో స్థానంలో నిలువగా.. ఇటలీ ప్రధాని మారియో డ్రాగ్నీ 60శాతంతో మూడో స్థానంలో ఉన్నారు.

చదవండి: Nasa Evtol Aircraft: ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీలపై నాసా ప్రయోగాలు

ఇక జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ 52శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 48శాతం ఓట్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకున్నారు. అఫ్గాన్‌లో బలగాల ఉపసంహరణ, తాలిబన్ల ఆక్రమణ వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ఐదో స్థానానికి పడిపోయారు.

చదవండి: Titanic Ship: ‘టైటానిక్‌’ చరిత్ర మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..

మరిన్ని వార్తలు