-

ట్రంప్‌ కారణంగా 30 వేలమందికి కరోనా

1 Nov, 2020 14:32 IST|Sakshi

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సర్వేలో వెల్లడి

వాషింగ్టన్‌ : అ‍గ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎ‍న్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో (నవంబర్‌ 3)న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో తగిన జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రచారంలో ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు దేశాన్ని చుట్టివచ్చారు. నువ్వా నేనా అనే విధంగా ఇరువురి నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎన్నిక ప్రత్యేక దృష్టిని ఆకర్శించింది. (బైడెన్‌పై అంత ప్రేమెందుకు?: ట్రంప్‌)

తొలిసారి అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ట్రంప్‌ విజయం సాధించాలని పట్టుదలగా ఉండగా.. మరోసారి గెలుపొంది రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని డొనాల్డ్‌ ట్రంప్‌ తహతహలాడుతున్నారు. కరోనా వ్యాప్తి భయంకరంగా సాగుతున్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కూడా ఓసారి వైరస్‌ బారీనపడ్డారు. అయినప్పటకీ గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. ఇక ఎన్నికలకు సమయం ఆసన్నమైతున్న క్రమంలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఓ కీలక నివేదికను విడుదల చేసింది.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగా అమెరికా వ్యాప్తంగా దాదాపు 30వేల మంది పౌరులు కరోనా వైరస్‌ పడగా.. మరో​ 700 మంది చనిపోయారని తన నివేదికలో పేర్కొంది. వైరస్‌ వ్యాప్తిని ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలు ఉల్లంఘించిన ప్రచార ర్యాలీలు నిర్వహించడం కారణంగానే పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ మేరకు జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను బహిర్గతం చేసింది. మరోవైపు తాజా రిపోర్టుపై డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బీడైన్‌ ఘాటుగా స్పందిచారు. అమెరికన్ల ప్రాణాలపై ట్రంప్‌కు ఏ బాధ్యత, గౌరవం లేదని విమర్శించారు. 


 

మరిన్ని వార్తలు