83 ఏళ్ల వృద్ధురాలితో 28 ఏళ్ల వ్యక్తి ప్రేమ వివాహం

6 Nov, 2022 20:46 IST|Sakshi

ప్రేమ గుడ్డిది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు వంటి  డైలాగులు సినిమాల్లో చూస్తుంటాం. కానీ కొన్ని  సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకు అన్నానంటే అతడి 28 ఏళ్లు, ఆమెకు 83 ఏళ్లు వారి మధ్య విడదీయరాని ప్రేమ చిగురించడం అంటే వినేందుకు కాస్త విడ్డూరంగా ఉంది కదూ. కానీ  ఆ ఇద్దరు ఒకరినొకరు విడిచి జీవించలేమంటూ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 

వివరాల్లోకెళ్తే....పోలాండ్‌కి చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు పాకిస్తాన్‌కి చెందిన 28 ఏళ్ల హఫీజ్‌ నదీమ్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులుగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ఒకరికొకరు జీవితాంతం కలిసే ఉండాలని వాగ్దానం చేసుకుని మరి ఒకటవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఐతే సదరు వృద్దురాలు మాత్రం నదీమ్‌ని విడిచి ఉండలేనంటూ ప్రియుడు కోసం ఏకంగా పాకిస్తాన్‌ వచ్చేసింది.

ఆ తర్వాత ఈ జంట పెద్దలను ఒప్పించి పాకిస్తాన్‌లోని హఫ్జాబాద్‌లో కాజీపూర్‌లో అక్కడ సంప్రదాయపద్ధతిలో నవంబర్‌ 2021న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తామెంతో సంతోషంగా ఉన్నామంటూ పలు ఇంటర్వూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: పెళ్లిలో తలెత్తిన గొడవ...నలుగురు మృతి)

మరిన్ని వార్తలు