బాప్‌రే! ఒకటి, రెండు కాదు.. ఏకంగా 11 వేలకు పైగా హత్యలు చేసిన 97 ఏళ్ల వృద్ధురాలు

20 Dec, 2022 18:17 IST|Sakshi

ఒకటి రెండు కాదు ఏకంగా వేలమందిని హత్య చేసింది ఒక వృద్ధురాలు. రెండో ప్రప్రంచ యుద్ధం సమయం నాటి కేసులో కోర్టు తాజాగా ఆమెను దోషిగా తేల్చి శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే.. 97 ఏళ్ల వృద్ధురాలు ప్రస్తుత పోలాండ్‌కి సమీపంలో ఉన్న స్టట్‌థాప్‌ నాజీ నిర్బంధ శిబిరంలో కార్యదర్శిగా పనిచేసింది. ఆ సమయంలో ఆమె అక్కడ నిర్బంధంలో ఉన్న యుద్ధ ఖైదీలు సుమారు 10,500 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఐతే ఆ హత్యల్లో ఈ వృద్ధురాలు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు జర్మనీలో ఇట్జెహులో జిల్లా కోర్డు మంగళవారం పేర్కోంది.

ఆ కేసులో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష తోపాటు ఆమె ఈ హత్యలు చేసినప్పుడూ వయసు 18 నుంచి 19 సంవత్సరాల మద్య ఉండటంతో అప్పటి బాల నేరస్తుల చట్టం ప్రకారం విధించే శిక్షలను కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఆమెపై దాదాపు 11,412 మంది హత్యలకు సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఐతే 2021 నుంచి కోర్టులో ట్రయల్స్‌ ప్రారంభం కావడం ఆలస్యమైంది. అదీగాక ఆమె కూడా అనారోగ్యంతో ఉండటంతో కోర్టుకు అందుబాటులో లేకుండా పోయింది.

ఆ వృద్ధురాలు 1943 నుంచి 1945 కాలంలో స్టట్‌థాప్‌ నాజీ నిర్బంధ శిబిరంలో పనిచేసింది. అక్కడ నిర్బంధంలో ఉన్న దాదాపు 65 వేల మంది ఆకలితో లేదా వ్యాధులతో మరణించారు. మరికొంతమంది స్టట్‌థాప్‌లోని గ్యాస్‌ చాంబర్‌లో మరణించారు. వారంతా నాజీల నిర్మూలన ప్రచారంలో పాల్గొన్న యుద్ధ ఖైదీలు, వారిలో కొందరూ యూదులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే ఇది రెండో ప్రపంచ యుద్ధ నేరాలకు సంబంధించిన చివరి కేసు విచారణ అని జర్మనీ స్థానికి మీడియా పేర్కొనడం గమనార్హం.

(చదవండి: రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్‌)

మరిన్ని వార్తలు