60 లక్షలు పలికిన లింకన్‌ వెంట్రుకలు

14 Sep, 2020 11:50 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌కు చెందిన కొన్ని వెంట్రుకలు, రక్తపు మరకల టెలిగ్రామ్‌ వేలం వేశారు. శనివారం జరిగిన వేలం పాటలో వాటిని 81వేల డాలర్ల( 60 లక్షల రూపాయలు)కు సొంతం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఆర్‌ఆర్‌ ఆక‌్షన్‌ ఆఫ్‌ బోస్టన్‌ అనే సంస్థ ఈ వేలం పాటను నిర్వహించింది. జాన్‌ లిక్స్‌ బూత్‌ చేతిలో కాల్చి చంపబడిన తర్వాత లింకన్‌కు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహిస్తున్నపుడు ఐదు సెంటీమీటర్ల పొడవుతో కొన్ని వెంట్రుకలు కత్తిరించి భద్రపరిచారు వైద్యులు. అనంతరం వాటిని 1865, ఏప్రిల్‌లో ఓ టెలిగ్రామ్‌ ద్వారా లింకన్‌ సహాయకుడికి పంపారు. ( అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ! )

ఆ తర్వాత వెంట్రుకలు, టెలిగ్రామ్‌ మాజీ అధ్యక్షుడి కుటుంబసభ్యుల వద్ద భద్రంగా ఉండింది. వీటిని 1999లో మొదటిసారి వేలం వేశారు. ఈ టెలిగ్రామ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. లింకన్‌కు ఆయన సెక్రెటరీ ఎడ్విన్‌ స్టాన్‌టన్‌కు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని, ఆ కారణంగానే ఎడ్విన్‌, లింకన్‌ చంపించటానికి చూశాడన్న చరిత్ర కారుల వాదనను ఈ టెలిగ్రామ్‌ తప్పని నిరూపిస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా