చైనాలో పకడ్బందీగా ఇంటర్నెట్‌ సెన్సార్‌

10 Aug, 2020 09:56 IST|Sakshi

బీజింగ్ :  చైనాలో ఇక‌పై యూజ‌ర్లు ఎంత‌మేర సెర్చ్ చేయాలో ప్ర‌భుత్వమే నిర్ణ‌యించ‌నుంది. చైనా వెలుప‌లు ఏం జ‌రుగుతుందన్న స‌మాచారాన్ని  సేక‌రించేందుకు వీలు లేకుంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇంట‌ర్నెట్ వినియోగంపై కొన్ని ఆంక్ష‌లు విధించ‌డానికి పావులు క‌దుపుతోంది. త‌మ‌కు న‌చ్చ‌ని వెబ్‌సైట్ల‌ని బ్లాక్‌చేసే ప‌నిలో ప్ర‌భుత్వం నిమ‌గ్న‌మ‌య్యింది. ఈ మేర‌కు ఇంటర్నెట్‌పై సెన్సార్‌పై  మరింత పకడ్బందీ చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయని ఓ నివేదిక‌లో వెల్ల‌డైంది. దీనికి అనుగుణంగా  గ్రేట్‌ ఫైర్‌ వాల్‌ ఆఫ్‌ చైనా అని పిలుచుకునే సెన్సార్‌ టూల్స్‌కి ప్ర‌భుత్వం కొత్త సాంకేతిక హంగులు అద్దుతోంది. దీంతో చైనాలో ఇంటర్నెట్‌ వినియోగదారులు వాడే వెబ్‌సైట్లు, యాప్స్‌ని మరింతగా నియంత్రిస్తోందని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యారీల్యాండ్, ఐయూపోర్ట్‌ సంయుక్త నివేదికలో వెల్లడైంది. చైనాలో ఇంటర్నెట్‌ సెన్సార్‌షిప్‌ని సమగ్రంగా అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. (ట్రంప్‌ కోసం రష్యా ప్రయత్నాలు)


దీని ప్ర‌కారం..‘గ్రేట్‌ ఫైర్‌ వాల్‌ ఆఫ్‌ చైనా హెచ్‌టీటీపీ ట్రాఫిక్‌ను నియంత్రించి ట్రాన్స్‌పోర్ట్‌ లేయర్‌ సెక్యూరిటీ ( టీఎల్‌ఎస్‌) 1.3, ఈఎస్‌ఎన్‌ఐ (ఎన్‌క్రిప్టెడ్‌ సర్వర్‌ నేమ్‌ ఇండికేషన్‌) వంటి కొత్త తరహా టెక్నాలజీని వినియోగిస్తోంది . అంతేకాకుండా చైనా వెలుపల నుంచి వచ్చే ఇంటర్నెట్‌ సమాచారాన్నంతటినీ చైనా బ్లాక్‌ చేస్తోంది. దీంతో ఆ దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులకు వారికి కావల్సిన సమాచారాన్ని స్వేచ్ఛ లేదని ఆ నివేదిక పేర్కొంది. టీఎల్‌ఎస్‌ 1.3 ఎన్‌క్రిప్ట్‌ చేయడం ద్వారా తాము అనుకున్న వెబ్‌సైట్లను చైనా ప్రభుత్వం బ్లాక్‌ చేసే పనిలో ఉంది. టీఎల్‌ఎస్‌ టెక్నాలజీని వినియోగించి నిర్ధారిత సర్వర్‌లను పనిచేయకుండా నిరోధిస్తోంది' అని నివేదిక‌లో వెల్ల‌డించింది. (ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...)

మరిన్ని వార్తలు