క్రీడాలోకం దిగ్భ్రాంతి: విమానం నుంచి పడిన క్రీడాకారుడు

19 Aug, 2021 21:21 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నుంచి బయల్దేరిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన ప్రపంచం మరువలేదు. తాజాగా విమానం నుంచి కిందపడిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వివరాలు వెల్లడి కాగా మరో యువకుడు మృతి చెందడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందుకంటే ఆ దేశ జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు విమానం నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. ఈ విషాదకర వార్త వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: విమానం నుంచి పడిపోయిన ఘటన.. అన్నదమ్ముల విషాద గాథ )

తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అఫ్గానిస్తాన్‌లో భయాందోళనలు ఏర్పడిన విషయం తెలిసిందే. తాలిబన్లు ఆగస్టు 15వ తేదీన ఆక్రమించగా ఆ భయంతో ఆ తెల్లారి 16వ తేదీన ప్రజలు కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగుల బాట పెట్టారు. అక్కడ ఉన్న అమెరికా యుద్ధ విమానం ఎక్కి ముగ్గురు కిందపడిన విషయం తెలిసిందే. మిగతా ఇద్దరు సోదరులు కాగా మరో యువకుడు ఆ దేశ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు. ఈ విషయం తెలుసుకున్న క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎంతో ప్రతిభ గల క్రీడాకారుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్యంత దారుణ పరిస్థితిలో మరణించడం కలచివేస్తోంది. అతడి పేరు జాకీ అన్వరీ. అఫ్గానిస్తాన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు. అమెరికా యుద్ధ విమానం సీ-17 పై నుంచి కిందపడిన వారిలో జాకీ ఒకడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా శాఖ ధ్రువీకరించింది. జాకీ అన్వరీ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

చదవండి: అథ్లెటిక్స్‌ దిగ్గజం కన్నుమూత.. విషాదంలో పీటీ ఉష

మరిన్ని వార్తలు