Afghanistan: పాపం పసివాడు, గుండెలు పగిలే దృశ్యం

17 Aug, 2021 20:29 IST|Sakshi

కాబూల్‌: అఫ్గన్‌ తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటినుంచి అనేక హృదయ విదారక దృశ్యాలు సోషల్‌​ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా తల్లిదండ్రులనుంచి తప్పిపోయిన 7 నెలల చిన్నారి  ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.  కాబూల్‌ ఎయిర్ పోర్టులో సోమవారం నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో సంబంధిత కుటుంబం నుంచి ఈ పసివాడు మిస్‌ అయి ఉంటాడని  భావిస్తున్నారు.

తాలిబన్ల ఆక్రమణ తరువాత  అఫ్గన్‌ పౌరుల్లో తీరని భయం నెలకొంది. ప్రాణభయంతో  పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.  అఫ్గానిస్తాన్‌లో అనేక భయంకరమైన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా పలువుర్నికలవర పెడుతున్నాయ. ముఖ్యంగా దేశం విడిచి ఎలాగైనా పారిపోవాలన్న ఆతృతలో కాబూల్ విమానాశ్రయానికి  వందలాది మంది క్యూకట్టారు. ఈ తొక్కిసలాట గందరగోళానికి తోడు గాలిలో నుండి ఇద్దరు వ్యక్తులు ఆకాశం నుండి కిందపడిపోయిన దృశ్యాలు అత్యంత బాధాకరంగా నిలిచాయి.

ఇపుడు ఒక ప్లాస్టిక్ క్రేట్‌లో చిన్నారి ఏడుస్తున్న దృశ్యాలు నెటిజన్లు కలచి వేస్తున్నాయి. సోమవారం నాటి గందరగోళంలో ఈ చిన్నారి తల్లిదండ్రుల నుండి విడిపోయినట్టుగా భావిస్తున్నారు. అశ్వక న్యూస్ ఏజెన్సీ ప్రకారం కాబూల్‌లో పీడీ-5 వీరు నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిడ్డను కనుగొనడంలో కుటుంబానికి సహాయం చేయనుందని పేర్కొంది. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా)

మరోవైపు దీనిపై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ ప్రజలను రక్షిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడంలో తాలిబన్ల వైఫల్యం అంటూ ఒకరు, ఇది తాలిబన్ల వైఫ్యలం, పిల్లలను రక్షించలేని విజయం విజయం కాదంటూ మరికొరు మండి పడుతున్నారు. 

చదవండి : Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!
Afghanistan crisis: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్‌ హీరోయిన్‌

మరిన్ని వార్తలు