Afghanistan హింసను తక్షణమే అంతం చేయాలి: ఐరాస

16 Aug, 2021 21:24 IST|Sakshi

అఫ‍్గనిస్తాన్‌లో ప‌రిణామాల‌పై ఐక్య‌రాజ్య‌స‌మితి ఆందోళ‌న‌

అఫ‍్గన్‌ ప్రజలను వదిలివేయకూడదు!

హింసను తక్షణమే అంతం చేయాలి

రాత్రికి జాతినుద్దేశించిన ప్రసంగించనున్న అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌

సాక్షి,న్యూఢిల్లీ: అఫ‍్గనిస్తాన్‌ సంక్షోభంపై ఐక్య‌రాజ్య‌స‌మితి స్పందించింది. ప్రస్తుత  పరిణామాలపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. తమతోపాటు, అంతర్జాతీయ సమాజం కలిసి నిలబడాలని, కలిసి పని చేయాలని ఐరాస ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్ విజ్ఞప్తి చేశారు. హింసను తక్షణమే అంతం చేయాలని పిలుపునిచ్చారు. తాము అఫ్గన్‌ ప్రజలను విడిచి పెట్టకూడదు, పెట్టలేమని పేర్కొన్నారు. ప్రపంచ తీవ్రవాద ముప్పును అణిచివేసేందుకు తమ వద్ద ఉన్న అన్ని సాధనాల ప్రయోగించాలని ఆయన ప్రపంచానికి పిలుపున్చారు.  

రాజధాని కాబూల్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నిర్వహించిన అత్యవసర సమావేశంలో గుటెరస్‌ మాట్లాడారు. బ‌ల‌ప్ర‌యోగంతో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్ల చర్య అంత‌ర్యుద్ధానికి దారితీస్తుంద‌ని వ్యాఖ్యానించారు. మరోవైపు తాలిబ‌న్‌లు అప్గన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత చైనా తాలిబన్లకు మద్దతుగా నిలవగా, అక్కడి సంక్షోభ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని బ్రిట‌న్ ప్ర‌ధానమంత్రి బోరిస్ జాన్స‌న్‌ ప్రకటించారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

చదవండి: Delivery Guy: ఎంత పని చేశాడు, షాకింగ్‌ వీడియో

మరిన్ని వార్తలు