Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్‌లకు..

17 Aug, 2021 15:57 IST|Sakshi

Taliban Announces "General Amnesty": అఫ్గనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు మంగళవారం కీలక ప్రకటన చేశారు. అఫ్గన్‌లో తాలిబన్ల రాజ్యస్థాపన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ శాంతి మంత్రం పఠించారు. దేశంలోని ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా.. మహిళలను తమ ప్రభుత్వంలో చేరాల్సిందిగా కోరారు. 

ఈ మేరకు తాలిబన్‌ సాంస్కృతిక కమిషన్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనాముల్లా సమంగానీ మాట్లాడుతూ... ‘‘మహిళలు బాధితుల్లా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావొచ్చు. అయితే, ఇంతవరకు మేం ప్రభుత్వ విధివిధానాలను ఖరారు చేయలేదు. కానీ, ఇస్లామిక్‌ నాయకత్వంలో అన్ని వర్గాలకు ప్రవేశం ఉంటుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చదవండి: ఏ క్షణాన ఏ వార్త వినాల్సివస్తుందో.. రషీద్‌ఖాన్‌
భారత్‌కు ముప్పేమీ లేదు: ఒమర్‌ అబ్దుల్లా

మరిన్ని వార్తలు