Afghanistan: అప్పుడే మొదలు.. ఇంటింటికీ వెళ్లి..

20 Aug, 2021 12:14 IST|Sakshi

కాబూల్‌: తాము గతంలో పాలించినట్లు ఈ సారి పాలన ఉండదని పూర్తిగా మారినట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే వారి పలుకులకు జనసంచరంలోని తాలిబన్ల చేతలకు ఏ మాత్రం పొంతన లేదు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న పరిణామాలకి ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంట్లిట్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారట. దీని బట్టి చూస్తే అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు నరమేదాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఇదంతా గ‌తంలో నాటో ద‌ళాల‌కు, ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన వారి కోసం గాలింపు చేప‌డుతున్నారు. ఆచూకీ దొరకకపోతే వారి కుటుంబ‌స‌భ్యుల‌ను బెరిస్తున్న‌ట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్ర‌తీకారం తీర్చుకోమ‌ని తాలిబ‌న్లు చెప్పినా.. ప్ర‌స్తుతం ఆ మిలిటెంట్లు మాన‌వ‌వేట కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా వ్య‌క్తిగ‌తంగా కూడా కొంద‌ర్ని తాలిబ‌న్లు టార్గెట్ చేస్తున్నార‌ని, ఆ బెదిరింపులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని రిప్టో నార్వేయ‌న్ సెంట‌ర్ త‌న నివేదిక‌లో తెలిపింది.అమెరికా బ‌ల‌గాలు అఫ్గనిస్తాన్‌లో ఉన్న స‌మ‌యంలో.. నాటో ద‌ళాలు కూడా తాలిబ‌న్ల అరాచ‌కాల‌ను ఎంతో సమర్థవంతంగా నిలువ‌రించగలిగాయి.

ప్ర‌స్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేప‌థ్యంలో వారికి స‌హ‌క‌రించిన వారి కోసం తాలిబ‌న్లు వేట మొదలు పెట్టారంట. వాళ్ల‌కు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయ‌మ‌ని, లేదంటే వాళ్ల‌ను ప‌ట్టుకుని విచారించి, వారి కుటుంస‌భ్యుల‌ను శిక్షిస్తామ‌ని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు యూఎన్ త‌న రిపోర్ట్‌లో తెలిపింది.

మరిన్ని వార్తలు