Taliban: ‘సోమనాథ్‌ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాం’

6 Oct, 2021 15:22 IST|Sakshi

కాబుల్‌: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు ప్రజల నుంచి దేవుళ్ల వరకు వెళ్లాయి. తాజాగా అక్కడి చారిత్రాత్మక సోమనాథ్ దేవాలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అందుకు బదులుగా ఆ స్థానంలో మహ్మమద్‌ గజ్నవి దర్గాను పునర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాలిబన్‌కు చెందిన అనాస్‌​ హక్కానీ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్‌లో.. ఇవాళ మేము ప‌దో శతాబ్దపు ముస్లిం వారియ‌ర్ మ‌హ్మమద్‌ గజ్నవి ద‌ర్గాకు వెళ్లాం. ఈ ప్రాంతంలో ఆయన ప‌టిష్టమైన ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ వైభవాన్ని మేము తిరిగి తీసుకొస్తామని తెలిపారు.

కాగా, అందుకోసం తాలిబన్లు సోమ్‌నాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. 998 నుంచి 1030 వరకు పాలించిన గజనావిడ్స్ తుర్కిక్ రాజవంశం మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు మహమూద్ గజ్నవి. అతను భారతదేశంలోని సంపన్న నగరాలు, కాంగ్రా, మధుర, జ్వాలాముఖ్ వంటి దేవాలయాలతో పాటుగా 17 సార్లు గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్న సంగతి తెలిసింది. సోమనాథ్‌పై దాడి చేసినప్పుడు, గజ్నవీ దేవాలయాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది భక్తులను చంపినట్లు చెబుతారు. 

కాగా సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతదేశపు మొదటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ప్రారంభించగా ఆయన మరణం తర్వాత మే 1951 లో పూర్తయింది. ప్రస్తుతం ఆ దేవాలయం అన్ని వైభవాలతో కళకళలాడుతోంది. ఇక ఈ ట్వీట్‌పై . బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాతో పాటు అనేక మంది భారతీయ నెటిజన్లు ధీటుగా స్పందించారు. అనస్ హక్కానీ ట్వీట్‌కు.. సోమనాథ్ ఆలయం ఇంకా ఉన్నతస్థానంలో ఉందని, గజ్నవీ నగరాలు నశించిపోతున్నాయని నెటిజన్లు గుర్తు చేశారు.

చదవండి: పైసల కోసమే ఫేస్‌బుక్‌ కక్కుర్తి! ఛస్‌.. లాజిక్‌ లేదన్న మార్క్‌

మరిన్ని వార్తలు