Afghanistan: దేశంలో పరిస్థితి బాలేదు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి: తాలిబన్లు

30 Oct, 2021 11:59 IST|Sakshi
తాలిబన్‌ సర్కార్‌ ముఖ్యాధినేతలు

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. క్రూరమైన శిక్షలు, పాశవిక పాలన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  మరోవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోవడంతో పాటు ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఖజానా పరంగా కూడా నగదు లేకపోవడంతో పొరుగు దేశాలతో ఎగుమతి ,దిగుమతులకు కూడా కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్‌ ప్రభుత్వం బ్యాంకులను కోరుతోంది. అఫ్గనిస్థాన్‌ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్, ఐరోపాలోని ఇతర సెంట్రల్ బ్యాంకులలో  నిల్వచేసింది. అయితే ఆగస్టులో ఇస్లామిస్ట్ తాలిబాన్ పాశ్చాత్య-మద్దతుగల ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి ఆయా దేశ ప్రభుత్వాలు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా నిలిపివేశాయి.

దీంతో ప్రస్తుతం తమ దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని తాలిబన్‌ ప్రభుత్వం బ్యాంకులను అభ్యర్థిస్తోంది. అఫ్గన్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఆ డబ్బు అఫ్గనిస్తాన్‌ దేశానిది. కాబట్టి మా డబ్బు మాకివ్వండి. నగదు నిల్వలను నిలుపుదల చేయడం సమజసం కాదని, అంతర్జాతీయ చట్టాలు, విలువలకు విరుద్ధం. ’’ అని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు విద్య సహా మానవ హక్కులను గౌరవిస్తుందని, మానవత్వంతో చేసే పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. 

చదవండి: ‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్‌గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’

మరిన్ని వార్తలు