Afghanistan: విమానంలోనే అఫ్గన్‌ మహిళ ప్రసవం

22 Aug, 2021 10:58 IST|Sakshi

కాబూల్‌: అమెరికా మిలటరీ విమానంలో అఫ్గన్‌ మహిళ ప్రసవించింది. కాబూల్‌ నుంచి జర్మనీ వెళుతుండగా విమానంలోనే మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. జర్మనీలోని రామ్‌స్టెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కాసేపట్లో ల్యాండ్‌ అవుతుందనగా.. ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.  ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అమెరికన్‌ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం రన్‌వేపై దిగిన వెంటనే తల్లీ బిడ్డను కార్గో 17లో  మిలటరీ ఆసుపత్రికి తరలించారు. 


అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్‌ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్‌ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్‌ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్‌ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న  తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.  

చదవండి: కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు

తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు

మరిన్ని వార్తలు