Mount Kilimanjaro: కిలిమంజారో పర్వతంపై వైఫై.. ఎవరెస్ట్‌పై ఏనాడో!

22 Aug, 2022 13:45 IST|Sakshi

డొడోమా: అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో. ఆఫ్రికన్‌ సంప్రదాయానికి ఈ పర్వతాన్ని ఒక ప్రతీకగా భావిస్తుంటారు. సుమారు 19వేల ఫీట్లకు పైగా ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఒక ఘనతగా భావిస్తుంటారు అధిరోహకులు. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 

కిలిమంజారో ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్‌ పర్వతం కూడా. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 12,200 అడుగుల ఎత్తుల ఈ వైఫైను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరికల్లా.. పర్వతంలో మూడింట రెండో వంతు భాగానికి ఇంటర్నెట్‌ సౌకర్యం అందనుంది.

అయితే వైఫై సౌకర్యం ఉన్న పర్వతం ఇదొక్కటే కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్‌ ఎవరెస్ట్‌పై 2010 నుంచే ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి చోట్లలో టెక్నాలజీపై ఆధారపడడం కూడా విపరీతాలకు దారి తీయొచ్చని అంటున్నారు నిపుణులు.

ఇదీ చదవండి: కరువు తప్పించుకునేందుకు చైనా ఏం చేస్తోందంటే..

మరిన్ని వార్తలు