ఇంగ్లాండ్‌లో మళ్లీ కరోనా ఉధృతి 

30 Sep, 2020 04:18 IST|Sakshi

లండన్‌: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత వారం 99 మంది, ఈవారంలో 139 మంది ప్రాణాలు కోల్పోయారు.  మహమ్మారి నియంత్రణ చర్యలను ప్రభుత్వం కఠినతరం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధని 18 ఏళ్లు పైబడిన వారికి 200 పౌండ్ల (రూ.18,950) జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే పునరావృతం అయితే 400 పౌండ్లు చెల్లించాల్సిందే. ఉల్లంఘన మళ్లీ జరిగే రెండింతల జరిమానా విధిస్తారు. పదేపదే తప్పు చేస్తే గరిష్టంగా 6,400 పౌండ్లు (రూ.6.06 లక్షలు) చెల్లించాల్సి రావొచ్చు. దేశంలో ప్రతి 10 వేల మందిలో 100 మంది కరోనా బారినపడ్డారు. 

మరిన్ని వార్తలు