ఆక్సిజన్‌ కొరత: సింగపూర్‌ భారీ సాయం 

26 Apr, 2021 10:41 IST|Sakshi

దేశంలో మూడున్నర లక్షలకు  పైగా రోజువారీ కేసులు

తీవ్ర ఆక్సిజన్‌ కొరత, ముందుకొస్తున్న ప్రపంచ దేశాలు

 సింగపూర్‌ నుంచి  ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు,   బైపాప్‌ పరికరాలు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో మూడున్నర లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో  2812 మరణాలు సంభవించాయి. మరోవైపు ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆక్సిజన్‌ కొరత సంక్షోభ సమయంలో బ్రిటన్‌, అమెరికా, సింగపూర్‌, సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌ పరికరాలు , 250 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు,  ఇతర వైద్య సామాగ్రి ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఆదివారం రాత్రి ముంబైకు చేరుకున్నాయి. మరోవైపు 318 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లతో అమెరికాలోని జెఎఫ్‌కె విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలు దేరింది. అటుసౌదీ అరేబియా 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను భారత్‌కు అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.  

చదవండి :  కోవిడ్‌ సంక్షోభం:  సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల సాయం
పీరియడ్స్‌ టైంలో మహిళలు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

మరిన్ని వార్తలు