2 లక్షల మంది ఆస్పత్రి పాలు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం మితిమీరిపోయింది. కలుషిత గాలిని పీల్చి సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో సుమారు 2 లక్షల మంది గతవారం ఆస్పత్రుల్లో చేరారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి కారణాలతో దేశంలో గాలి నాణ్యత స్థాయిలు గణనీయంగా పడిపోయాయి.
బ్యాంకాక్‌లోని 50 వరకు జిల్లాల్లో గాలి నాణ్యత సురక్షితం కాని 2.5 పీఎం స్థాయికి పడిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని మించి పోయింది. ఈ స్థాయిలో గాలి కణాలు రక్తంలో కలిసిపోయి అవయవాలను దెబ్బతీస్తాయి.