ఫైజర్‌ టీకాతో అలర్జీ

18 Dec, 2020 04:53 IST|Sakshi
ఆర్మీ అధికారికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్న దృశ్యం

ఆందోళన అవసరం లేదన్న అమెరికా ఆరోగ్య శాఖ  

అలాస్కా/వాషింగ్టన్‌:  అమెరికాలో కోవిడ్‌–19ను నిరోధించే ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో అలర్జీ లక్షణాలు కనిపించాయి. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో కూడా ఫైజర్‌ వ్యాక్సిన్‌తో అలర్జీకి సంబంధించిన రెండు కేసులు బయటపడిన విషయం తెలిసిందే.  తాజాగా అమెరికాలోని అలాస్కాలోనూ టీకా డోసు తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనారోగ్యానికి గురి కావడంపై ఆందోళన నెలకొంది.

అమెరికాలో అలర్జీ లక్షణాలు కనిపించిన ఆరోగ్య కార్యకర్తలకు గతం లో ఎప్పుడూ అలర్జీ రాలేదు. ఫైజర్‌ టీకా డోసు తీసుకున్న వెంటనే వారిలో కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకోవడంలో ఇ బ్బందులు, కళ్ల కింద వాపు, తలనొప్పి, గొం తు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికన్లలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పష్టం చేసింది. ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని భరోసా ఇచ్చింది.   

నేడు పైన్స్‌కు.. వచ్చేవారంలో బైడెన్‌కు
వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ నేడు వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. వచ్చే వారంలో బైడెన్‌ కూడా టీకా తీసుకుంటారని ఆరోగ్య శాఖ అధికారు లు వెల్లడించారు. అందరి ఎదుట వ్యాక్సిన్‌ తీసుకుంటానని బైడెన్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు