జోధా అక్బర్‌ ఫేమ్‌ అమన్‌ ధలివాల్‌పై దాడి

17 Mar, 2023 04:54 IST|Sakshi

కాలిఫోర్నియా: జోధా అక్బర్‌సహా పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించిన యువ పంజాబీ నటుడు అమన్‌ ధలివాల్‌పై అమెరికాలో ఒక ఆగంతకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఛాతీ, మెడ, తల, భుజంపై పలు చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. ఘటన తర్వాత అమన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం ఏమీలేదని వైద్యులు తెలిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

గురువారం ఉదయం కాలిఫోర్నియా నగరంలోని గ్రాండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని ఒక జిమ్‌లో కసరత్తు చేస్తున్న అమన్‌పైకి ఒక ఆగంతకుడు కత్తితో దాడి చేసి బందీగా పట్టుకున్నాడు. తాగడానికి నీళ్లు కావాలని అక్కడి వారిని ఆగంతకుడు బెదిరించిన సమయంలో ఒక్కసారిగా అమన్‌ ఎదురుతిరిగి అతడిని పట్టుకోబోయాడు. ఈ ఘర్షణలో అమన్‌ గాయాలపాలై రక్తసిక్తమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన జిమ్‌లోని తోటివారు ఆ ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అమన్‌పై ఆగంతకుడు దాడి దృశ్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: https://twitter.com/ShekharPujari2/status/1636306115502931968

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు