ఈ జిరాఫీని తినొచ్చు

30 May, 2022 02:08 IST|Sakshi

మీరు చదివింది నిజమే. ఈ జిరాఫీని తినేయొచ్చు. అడవుల్లో ఆకు లు, అలములు తిని బతికే జిరాఫీని మనం తినడం ఏంటి అని తిట్టుకుంటున్నారా? అపార్థం వద్దు.. ఎందుకంటే ఇది చాక్లెట్‌ జిరాఫీ. ఈవారం ఇంటర్నెట్‌ సంచలనంగా మారిన ఈ జిరాఫీని జూమార్ఫిక్‌ కలినరీ ఆర్ట్స్‌లో నిపుణుడైన అమౌరీ గుయ్‌చాన్‌ రూపొందించాడు. 8.3 అడుగుల పొడవైన ఈ జిరాఫీని పూర్తిగా వందశాతం చాక్లెట్‌తోనే తయారు చేశారు.

దూరం నుంచి చూస్తే నిజమైన జిరాఫీని తలపిస్తున్న దీన్ని దగ్గరికి వెళ్తేగానీ శిల్పమని గుర్తించలేం. చాక్లెట్‌తో ఇప్పటికే సింహం, పులిలాంటి జంతువులను, మరెన్నో సముద్ర జీవులను, టెలిస్కోప్, క్లాక్‌ వంటి క్లాసిక్‌ వస్తువులను, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని సైతం రూపొందించిన అమౌరీ... ఇంత పెద్ద జంతువును తయారు చేయడం ఇదే మొదటిసారి. 72.5కిలోల బరువున్న ఈ జిరాఫీని రూపొందించడానికి ఏడురోజుల సమయం పట్టిందట. చాక్లెట్‌తో మరెన్నో తయారు చేయొచ్చని చెబుతూ... అమౌరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన తయారీ వీడియోను 8కోట్ల మంది చూశారు.  

మరిన్ని వార్తలు