కరోనా ఎఫెక్ట్ : దూసుకుపోయిన అమెజాన్

30 Oct, 2020 12:19 IST|Sakshi

అంచనాలకు మించి బ్లాక్ బస్టర్  ఆదాయం

 క్యూ3లో మూడు రెట్లు పెరిగిన లాభాలు

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి  సమయంలో ఆన్ లైన్ రీటైలర్ అమెజాన్  లాభాల్లో  దూసుకుపోయింది.  క్యూ3లో బ్లాక్ బస్టర్ లాభాలను నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు మూడు  రెట్లు పెరిగాయి.  ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ భారీగా పుంజుకున్నాయి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో  వృద్ది నమోదైంది. దీంతో  మూడవ త్రైమాసిక  ఫలితాల్లో ఏడాది క్రితంతో పోలిస్తే  లాభాలు మూడు రెట్లు పెరిగాయని కంపెనీ గురువారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 37శాతం  పెరిగాయి. దీంతో కరోనావైరస్ మహమ్మారి కాలంలో   భారీగా  లాభపడిన టెక్ దిగ్గజాల్లో  ఒకటిగా అమెజాన్ నిలిచింది. (అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు)

ఏడాది క్రితం 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,655 కోట్లు) తో పోలిస్తే ప్రస్తుతం  లాభం 6.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 46,764 కోట్లు)  గా నమోదయ్యాయి. ఆదాయం 37 శాతం పెరిగి 96.15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 7,12,824 కోట్లు) పెరిగాయి. క్లౌడ్ డివిజన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ త్రైమాసికంలో 28 శాతం వృద్ధిని 11.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 86,504 కోట్లు) సాధించిందని కంపెనీ తెలిపింది. 

మరిన్ని వార్తలు