మహిళా వర్తకుల ఉత్పత్తులకు ప్రాధాన్యం

6 Mar, 2021 05:16 IST|Sakshi

యూఎన్‌ ఉమెన్‌తో అమెజాన్‌ ఇండియా భాగస్వామ్యం

ప్రముఖ ఈ–కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ఇండియా దేశంలోని మహిళల నేతృత్వంలోని చిన్న వ్యాపారులకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మహిళా సాధికారిత కోసం పనిచేసే సంస్థ యూఎన్‌ ఉమెన్‌తో భాగస్వామ్యమైంది. ఇప్పటికే 450 మందికి పైగా మహిళ వ్యాపారస్తులు ఉత్పత్తి చేసిన సుమారు 80 వేలకు పైగా ప్రత్యేక స్టోర్‌ ఫ్రంట్‌ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇందులో జరిగే ప్రతి లావాదేవీ మీద రూ.25లను దేశంలోని నిరుపేద బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఎన్‌జీఓ ‘నన్హీ కలీ’కు తమ వంతు బాధ్యతగా విరాళం కింద అందజేస్తున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారితో కలిగిన ఆర్ధిక విఘాతంతో మహిళల ఆదిపత్య రంగాలు, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసిందని, మహిళలు జీవనోపాధి కోల్పోయే దశకు చేరిందని అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. మహిళల్లో వ్యవస్థాపకత మెరుగైన ఆర్ధిక ఫలితాలను చూపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమిత్‌ అగర్వాల్‌  చెప్పారు. 

మరిన్ని వార్తలు