విజయానికి ఆరు ఓట్ల దూరంలో..

5 Nov, 2020 08:54 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు తెరపడింది. విజయ బావుటా ఎగరవేయటానికి జో బైడెన్‌ అత్యంత సమీపంలో ఉన్నారు. ఆరు ఎలక్టోరల్‌ ఓట్లు సొంతమైతే మ్యాజిక్‌ ఫిగర్‌ను ఆయన చేరుకుంటారు. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడవుతారు. ఇప్పటివరకు బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. ఇంకా కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో గెలుపెవరిదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ( బైడెన్‌ వైపే ముస్లింలు..)

అయితే జార్జియాలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును అడ్డుకోవటానికి ట్రంప్‌ న్యాయపోరాటానికి దిగుతున్నట్లు సమాచారం. ఎన్నికల రోజు రాత్రి 7 గంటల లోపు అందుకున్న బ్యాలెట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిందిగా జార్జియా చట్టాలు చెబుతున్నాయని రిపబ్లికన్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు కోర్టులో కేసు వేస్తున్నారట. దీనిపై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చెప్పలేం. జార్జియా చట్టాల్లో మార్పు చేసి, బ్యాలెట్‌ ఓట్ల అనుమతి గడవును పెంచాలని గతంలో డెమొక్రాటిక్‌ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో రిపబ్లికన్‌ పార్టీ గెలుపు సాధించింది.

మరిన్ని వార్తలు