వెలుగులోకి వేల ఏళ్ల నాటి బీర్‌ ఫ్యాక్టరీ

14 Feb, 2021 16:38 IST|Sakshi
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బీర్‌ ఫ్యాక్టరీ

కైరో : ఈజిప్ట్‌లోని పురావస్తు శాఖకు చెందిన ఓ ప్రముఖ ప్రదేశంలో అత్యంత పురాతన బీర్‌ ఫ్యాక్టరీ ఒకటి బయటపడింది. అమెరికా-ఈజిప్ట్‌ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ ఫ్యాక్టరీ వెలుగుచూసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు అధికారులు. దేశ రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలో ఎబిడాస్‌లో.. నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో ఈ ఫ్యాక్టరీని కనుగొన్నారు. ఆ బీర్‌ ఫ్యాక్టరీ నర్మర్‌ చక్రవర్తి కాలానికి చెందిన గుర్తించారు. ఫ్యాక్టరీలో మొత్తం 8 యూనిట్లు.. ఒక్కో యూనిట్‌ ఇరవై మీటర్లు పొడవుతో, 2.5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ( షాకింగ్‌.. అంకుల్‌ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి..)

బీర్‌ ఫ్యాక్టరీ కుండలు
ఒక్కో యూనిట్‌లో దాదాపు 40 కుండలు రెండు వరుసలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కుండలలో బీర్‌ తయారు చేయటానికి అవసరమైన పదార్థాలను వేసి, మరిగించేవారు. రాజ కార్యక్రమాల కోసం బీరును ఉపయోగించేవారు. కాగా, బీరు ఫ్యాక్టరీ ఉనికిని మొట్టమొదటిసారిగా 1900లలో బ్రిటీష్‌ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ, ఫ్యాక్టరీ ఎక్కడ ఉందన్న సంగతి చెప్పలేకపోయారు.

మరిన్ని వార్తలు