వ్యాక్సిన్‌ మొదట మాదేశానికి కావాలి : ట్రంప్‌

10 Dec, 2020 09:55 IST|Sakshi

వాషిం​‍గ్టన్‌ : కరోనా మహమ్మారికి అంతానికి వ్యాక్సిన్లను అందుబాటులోకి  తీసుకొచ్చేందుకు  ప్రపంచవ్యాప్తంగా  కసరత్తు ముమ్మరమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కరోనా వ్యాక్సిన్‌ మొదట తమ దేశానికే కావాలని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులపై సంతకం చేయడం గమనార్హం. ఒకవైపు  ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.  మరోవైపు టీకాను సొంతం చేసుకోవడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో ట్రంప్‌ వ్యాఖ‍్యలు కీలకంగా మారాయి.

అమెరికాలో తయారైన వ్యాక్సిన్ అయినా, విదేశాల్లో తయారైనా వ్యాక్సిన్‌ తమకే మొదటి ప్రాధాన్యం అన్నట్టుగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు ట్రంప్. కాగా టీకా విషయంలో అమెరికా ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. సప్లై విధానం.. అమెరికన్లకు ప్రాధాన్యత తదితర అంశాలపై ఓ క్లారిటీకి రాగా.. ఇలాంటి సమయలో ట్రంప్ ఆదేశాలు న్యాయ కమీషన్‌ ముందు  నిల‌బ‌డ‌తాయా లేదా అన్నది సందేహస్పదంగా మారింది. ఇక వ్యాక్సిన్‌ విషయంలో అమెరికా  విధానాలు ఎంతమేరకు సఫలమవుతాయన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే  ట్రంప్‌ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోపు 10 కోట్ల మందికి, జూన్‌లోపు ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని  లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ 10 కోట్ల మం‍దికి టీకా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఆయన జనవరి 20న  నూతన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు