వైరస్‌ గుట్టు తెలిసింది!

13 Aug, 2020 08:21 IST|Sakshi

వాషింగ్టన్‌: ఒకవైపు కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతూంటే ఇంకోవైపు ఈ మహమ్మారి బలహీనతలేమిటో గుర్తించేందుకూ శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ వైరస్‌ కొమ్ములో ఉండే ఓ లోటును గుర్తించారు. దీని ఆధారంగా కోవిడ్‌–19కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని అంచనా. మనిషి శరీర కణాల్లోకి ప్రవేశించేందుకు కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ లేదా కొమ్మును వాడుతుందని మనకు తెలుసు. అయితే ఈ ప్రొటీన్‌ కణానికి అంటుకునే ప్రాంతానికి కొన్ని నానోమీటర్ల దూరంలో ఓ చీలిక లాంటిది ఉందని, ధనావేశం కలిగి ఉండే ఈ చీలికకు రుణావేశపు పరమాణువును జోడిస్తే వైరస్‌ కణానికి అతుక్కోవడం నిలిచిపోతుందని తాము గుర్తించినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మోనికా ఒలివేరా డిలా క్రజ్‌ తెలిపారు. వైరస్‌ జన్యుక్రమంలో వచ్చిన మార్పుల కారణంగా వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గిందని కూడా తమ పరిశోధనలు చెబుతున్నాయని వివరించారు. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన! )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా