నేను గిటారు వాయిస్తాను... మీరు పాట పాడండి ప్లీజ్‌!

4 Oct, 2021 20:58 IST|Sakshi

న్యూయార్క్‌:  మధ్య కాలంలో యూట్యూబ్‌తో పాటు పలు సోషల్‌ మీడియా యాప్‌ల ద్వారా ఫేమస్‌ అవ్వాలని ప్రయత్నించే వారు పెరుగుతున్నారు. ఇలా ప్రయత్నిసస్తున్న వారిలో కొందరు విజయం సాధించి.. రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంటున్నారు. ఇదే కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో ఒక అమెరికన్‌ యూ ట్యూబర్‌ చాలా విచిత్రంగా "నేను గిటార్‌ వాయిస్తాను ఒక పాట పాడతారా" అని కనిపించిన వారందర్నీ అడుగుతున్నాడు. అతడి అభ్యర్థనను ఎవరైనా అంగీకరించాలా లేదా తెలియాలంటే ఇది చదవాల్సిందే.

(చదవండి: మిస్‌ వరల్డ్‌ అమెరికాగా తొలి భారత సంతతి అమెరికన్‌)

న్యూయార్క్‌లోని  వీధుల్లో దారి పోడవున తనకు కనపించిన వాళ్లందర్నీ "నాతో పాడతారా ప్లీజ్‌" అంటూ అమెరికన్‌ గిటారిస్ట్‌ రెజినాల్డ్ గుయిలౌమ్ అడగటం మొదలుపెట్టాడు. ఒక భారతీయ వ్యక్తి గౌరంగ్ రాఖోలియా మాత్రమే అతని అభ్యర్థనను అంగీకరించాడు. పైగా నాకు హిందీ పాటు మాత్రమే వచ్చు అన్నాడు. దీంతో అతన పర్వాలేదు తాను ట్యూన్‌ నేర్చుకోవడానికీ కొద్ది నిమిషాలే తీసుకుంటానని గుయిలౌమ్ చెప్పాడు. ఆ తర్వాత  గౌరంగ్ 1982లో వచ్చిన సినిమా 'సత్తె పే సత్తా' లోని లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ పాట దిల్బర్ "మేరే కబ్ తక్ ముజే, ఐస్ హాయ్ తాడ్పాగే" అనే పాటను తన ముబైల్‌లో వినిపించాడు. కొద్ది నిమిషాల్లోనే రెజినాల్డ్‌  రెడీ అని అనడంతో గౌరంగ్‌ కూడా సరే అన్నాడు.

ప్రస్తుతం వీరు పాట పాడిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైగా పాట పాడటం పూర్తయ్యాక గౌరంగ్‌ హడావిడిగా వెళ్లిపోతుంటే అమెరికన్‌ యూట్యూబర్‌ రెజినాల్డ్‌ తనతో కలిసి పాడినందుకు 'ధన్యావాద్‌' అని హిందీలో అన్నాడు. గౌరంగ్‌ ఇంగ్లీష్‌​లో థ్యాంక్యూ అని చెప్పాడు. వీరిద్దరి ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పైగా వారు ఒకరి సంస్కృతిని ఒకరు మార్చుకున్నట్టుగా ఉంది కదూ అంటూ కామెంట్‌ చేస్తున్నారు

(చదవండి: ఫోటోగ్రాఫర్‌లు వెంటపడటంతోనే అలా చేశా.....!: గ్రిమ్స్‌)

మరిన్ని వార్తలు