వీడియో: మేం స్వచ్ఛందంగా యుద్ధ భూమిలో.. ఆయన కొడుకు అలానా?

25 Oct, 2023 19:43 IST|Sakshi

‘మేం కుటుంబాన్ని వదిలేశాం. యుద్ధ భూమిలో ముందు నిలబడ్డాం. కానీ, ఆయన దేశ ప్రధానికి కొడుకు. ఆయన మాత్రం మియామీ బీచ్‌లో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు’ అని ఒకరు..  ‘నేను నా జీవితనం, నా కుటుంబం, ఉన్న ఊరిని వదిలేసి వచ్చా.. క్లిష్ట సమయంలో నా దేశాన్ని వదిలేయలేదు. మరి ప్రధాని తనయుడు ఎక్కడ?’.. ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ 32 ఏళ్ల తనయుడు ఎక్కడ? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజిమన్‌ నెతన్యాహూ తీరుపై సొంత దేశాల ప్రజలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆడామగా, యువకులు, ముసలి తేడా లేకుండా హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్‌ పౌరులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వలంటీర్లు సైతం కదన రంగంలోకి దిగారు. కానీ, ప్రధాని తనయుడు మాత్రం అమెరికాలో సెలవుల్ని ఆస్వాదిస్తున్నాడు. 

నెతన్యాహూ తనయుడు యైర్‌(32) ఈ ఏడాది ఆరంభంలో ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో యైర్‌ రిలాక్స్‌గా గడుపుతున్న ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్యే 32వ పుట్టినరోజు వేడుకగా చేసుకున్నాడు. ఆ ఫొటోలు స్వయంగా యైర్‌ పోస్ట్‌ చేయడంతో విమర్శలు ఉవ్వెత్తున వచ్చిపడుతున్నాయి. యైర్‌.. బెంజిమిన్‌ నెతన్యాహూ మూడో భార్య కొడుకు. ఇస్లామిక్‌ వ్యతిరేక పోస్టులతో గతంలో వార్తల్లోకి ఎక్కాడు. ఇజ్రాయెల్‌ నుంచి ముస్లింలంతా వెళ్లిపోతేనే శాంతి అంటూ పోస్ట్‌ చేసి.. తాత్కాలికంగా బ్యాన్‌ను ఎదుర్కొన్నాడు.  

Video Credits: Hindustan Times

మరిన్ని వార్తలు