Russia-India Oil Imports: అమెరికా హెచ్చరిస్తే.. భారత్‌ డబుల్‌ డోసు!

20 Apr, 2022 16:15 IST|Sakshi

అమెరికా ప్రత్యక్ష, పరోక్ష హెచ్చరికలను.. భారత్‌ తేలికగా తీసుకుంది. పైగా రష్యా ముడి చమురు కొనుగోళ్లను భారతదేశం రెట్టింపు చేస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధం మూడో నెలకు చేరుకున్న దరిమిలా.. ఓపెక్‌ ఉత్పత్తిదారుల నుంచి కొనుగోళ్లను పెంచుకుంటూ పోతోంది భారత్‌. 

రష్యా-భారత్‌కు మధ్య ఎప్పటినుంచో ఆయుధాలు, ఆయిల్‌ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు, రష్యాపై ఆంక్షల వంకతో భారత్‌ను రష్యాకు దూరం చేయాలని అమెరికా భావించింది. అవసరమైతే ఎనర్జీ విషయంలో సాయం చేస్తామంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ప్రధాని మోదీకి ఆఫర్‌ కూడా ఇచ్చాడు.

క్లిక్‌: Viral Video: బతుకుతుందని అనుకోలేదు.. ఇది ఆమెకు కచ్చితంగా పునర్జన్మే!

కానీ, తక్కువ ధర, ఒప్పందాలు ఆకర్షనీయంగా ఉండడంతో రష్యా వైపే భారత్‌ మొగ్గు చూపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధీనంలోని చమురు శుద్ధి సంస్థలు.. మంచి ధరలను పొందడానికి పబ్లిక్ టెండర్ల ద్వారా కొనుగోలు చేయడానికి బదులుగా ప్రైవేట్‌గా చర్చల ఒప్పందాలను చూస్తున్నాయి. రష్యన్ చమురు ఇప్పుడు మరింత చౌకగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే భారత్‌, దిగుమతి ఉత్పత్తులను రెట్టింపు చేస్తోంది.

ఒకవైపు యూరోపియన్ యూనియన్‌ సైతం రష్యా నుంచి చమురును విపరీతంగా కొనుగోలు చేస్తుండగా.. ఆపేయాలంటూ అమెరికా, మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇక చైనాలో క్రూడ్ డిమాండ్ కరోనా విజృంభణతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరోవైపు రష్యా దిగుమతులను నిషేధిస్తామని యూఎస్‌, యూకేలు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశాయి. కానీ, భారత్‌ మాత్రం ఆంక్షలు, హెచ్చరికలను తేలికగా తీసుకుంటూ రష్యా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది.

మరిన్ని వార్తలు