Anaconda Video Viral: లక్కీ ఫెలో.. అనకొండ దాడిలో జస్ట్‌ మిస్‌ అయ్యాడు.. వీడియో వైరల్‌

8 Jul, 2022 15:26 IST|Sakshi

పామును చూస్తేనే ఒక్కసారిగి భయాందోళనకు గురవుతుంటాము. అలాంటిది ఏకంగా భారీ అనకొండ నుంచి ప్రాణాలకు కాపాడుకోవడమంటే మాములు విషయం కాదు. కాగా, ఓ వ్యక్తి అదృష్టవశాత్తు అనకొండ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన గైడ్‌ జోవో సెవెరినో(38).. అనకొండ దాడిలో తన ప్రాణాలను కోల్పోకుండా తృటిలో తప్పించుకున్నాడు. కాగా, జోవో సెరియన్‌.. అరగుయా నదిలో పర్యాటకుల బృందంతో విహారయాత్రలో ఉన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు చుట్టుప్రక్కల ప్రాంతాలను ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో సెవెరినోకు నదిలోని నీటిలో ఉన్న గ్రీన్ అనకొండ కనిపించడంతో సరదాగా వీడియో తీశాడు. అదే సమయంలో అదును చూసి అనకొండ అతడిపై దాడి చేసే క్రమంలో కాటు వేసింది. ఈ క్రమంలో తృటిలో పాము నుంచి అతను తప్పించుకున్నారు. దీంతో పడవలో ఉ‍న్న ప్రయాణీకులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేశారు. 

ఇక, గ్రీన్‌ అనకొండ.. 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దక్షిణ అమెరికాకు చెందిన గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. కాగా, నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, మగ గ్రీన్‌ అనకొండ కంటే.. ఆడ అనకొండలు చాలా పెద్దవిగా ఉంటాయి. సాధారణంగా ఇవి.. చిత్తడి నేలలు, నెమ్మదిగా కదులుతున్న ప్రవాహాలలో, ప్రధానంగా అమెజాన్ బేసిన్‌లోని ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి. 

A post shared by João Severino (@lavaginha_)

ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్‌ రైలు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు