ఐస్‌క్రీంతో ప్రాంక్ చేద్దామనుకుంటే షాక్‌ ఇచ్చాడు.. ఈ బుడ్డోడు సూపర్‌

14 Sep, 2022 19:35 IST|Sakshi

టర్కీలో ఐస్‌క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. కోను చేతిలో పెట్టినట్టే పెట్టి టక్కున వెనక్కి లాగేసుకుంటారు. నోరూరించే ఐస్‌క్రీం తిందామని వెళ్లిన వారికి ఫ్రస్టేషన్ వచ్చే వరకు ప్రాంక్ చేస్తూనే ఉంటారు. చివరకు కస్టమర్లకు నీరసం వచ్చే టైంలో ఐస్‌క్రీం చేతిలో పెడతారు. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం.

కానీ ఓ బుడ్డోడు ఇలానే ప్రాంక్ చేద్దామనుకున్న ఓ టర్కీ ఐస్‌క్రీం వ్యాపారస్థుడికి షాక్ ఇచ్చాడు. ప్రాంక్ చేద్దామనుకుంటే చుక్కలు చూపించాడు. ఐస్‌క్రీం కోను చేతిలో పెట్టి వెనక్కి లాగేసుకుందాం అనే లోపే.. ఈ బుడ్డోడు ఐస్‌క్రీం ఇచ్చే కర్రను చేతితో బిగ్గరగా పట్టుకున్నాడు. అంతేకాదు ఐస్‌క్రీం వెండర్ చేతిపై కొట్టాడు. బాల భీముడిలా ఉన్న పిల్లాడి బలం ముందు ఆ వెండర్ నిలబడలేకపోయాడు. ఐస్‌క్రీం స్టిక్ వెనక్కి తీసుకునేందుకు వంగి వంగి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. చివరకు బుడ్డోడు హీరోలా తన ఐస్‌క్రీం తీసుకొని హాయిగా తినుకుంటూ వెళ్లాడు. అక్కడున్న వారంతా బుడ్డోడి చర్యను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.

A post shared by Dinesh Kumar (@black_dancer_dinesh)

ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. బుడ్డోడిని అనేక మంది మెచ్చుకుంటున్నారు. ప్రాంక్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు.. చిన్నోడు మామూలోడు కాదు అని కొనియాడారు.
చదవండి: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు