Turkey Earthquake: టర్కీలో మరోసారి భారీ భూకంపం.. ముగ్గురు మృతి.. 200 మందికి గాయాలు..

21 Feb, 2023 08:48 IST|Sakshi

ఇస్తాన్‌బుల్‌: టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్‌ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  భూకంపం ధాటికి ముడు అపార్ట్‌మెంట్లు కూలిపోయాయి. ముగ్గురు చనిపోయారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. భూకంపం సంభవించింది సరిహద్దు ప్రాంతం కావడంతో సిరియాలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఆరుగురు గాయపడ్డారు.

రెండు వారాల క్రితమే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వేల భవనాలు కుప్పకూలి 47,000 మందికిపైగా చనిపోయారు.  అనేక మంది గాయపడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.. ఇప్పుడు మళ్లీ భూకంపం రావడం ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే తాజాగా భూకంపం వచ్చిన ప్రాంతంలో జనాలు ఎక్కువగా నివసించడం లేదని అధికారులు పేర్కొన్నారు. గత భూకంపంలో కూలిపోయిన తమ ఇళ్ల నుంచి సామాన్లు, వస్తువులు తీసుకోవాడనికి వెళ్లి ఉంటారని చెప్పారు.

చదవండి: విద్వేషమే విడదీసింది! కొరియన్‌ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది

మరిన్ని వార్తలు