ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్

21 May, 2022 19:34 IST|Sakshi
ఆంథోనీ అల్బనీస్‌(ఫైల్‌ఫోటో)

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో జరిగిన ఫెడరల్ ఎన్నికలలో, ప్రతిపక్ష లేబర్ పార్టీ.. స్కాట్ మోరిసన్ ప్రభుత్వాన్ని ఓడించింది. ఈ మేరకు శనివారం స్కాట్‌ మోరిసన్‌ తన ఓటమిని అంగీకరించారు.  ఫలితంగా ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా లేబర్‌ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. లిబరల్‌ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా నాయకత్వం నుంచి కూడా మోరిసన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు మోరిసన్‌ మాట్లాడుతూ..." నాయకుడిగా నేను గెలుపోటములకు పూర్తిగా బాధ్యత వహిస్తాను. లిబరల్‌ పార్టీకి నాయకత్వం వహించడం గొప్ప అదృష్టం. ఈ గొప్ప దేశానికి తనను నాయకుడిగా చేసేందుకు మద్దతిచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. కొత్త నాయకత్వంలో మన పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. 

ఆస్ట్రేలియా 31వ ప్రదానిగా ఆంథోని

  • లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అల్బనీస్‌ 1996 నుండి ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.
  • 2013లో ఆస్ట్రేలియా ఉప ప్రధాన మంత్రిగా పనిచేసిన ఆయన 2007 నుంచి 2013 మధ్య క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
  • 2022 ఎన్నికల ప్రచారంలో ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అణుగుణంగా బలమైన సామాజిక భద్రతను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయన్ని కూడా అందిస్తానని లేబర్‌ పార్టీ వాగ్దానం చేసింది. 2050 నాటికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను మరింత ప్రతిష్టాత్మకంగా 43 శాతం మేర తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని కోరుకుంటున్నట్లు కూడా పార్టీ పేర్కొంది.
  • ఆంథోనీ అల్బనీస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జపాన్‌లో  పర్యటించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.

ఆంథోనికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ:
ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య ప్రాధాన్యతల కోసం మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు.

(చదవండి: పాకిస్తాన్‌ మాజీ మంత్రి కిడ్నాప్...)

మరిన్ని వార్తలు