వైరస్‌ అభూత కల్పన కాదు: ఆంటోని ఫౌసీ

7 Oct, 2020 15:55 IST|Sakshi

వాషింగ్టన్‌: శ్వేత సౌధంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా నిర్ధారణ అయిన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా గత వారం కరోనా బారిన పడ్డారు. తాజాగా నేడు సీనియర్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లెర్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన వైట్ హౌస్ సిబ్బంది సంఖ్య 10కి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో చూడండి అంటూ పరోక్షంగా ట్రంప్‌ని ఎద్దేవా చేశారు. అమెరికన్‌ యూనివర్శిటీస్‌ కెన్నడీ పొలిటికల్‌ యూనియన్‌ ఇంటర్వ్యూలో ఫౌసీ మాట్లాడారు. కరోనా మహమ్మారి అభూత కల్పన అని భావించే వారికి కోవిడ్‌ గురించి ఎలా వివరించాలి అనే ప్రశ్న ఎదురయ్యింది ఫౌసీకి. (చదవండి: ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్‌, భాధ్యతలేకుండా...)

దానికి సమాధానంగా ఫౌసీ ఈ ‘వారం వైట్‌హౌస్‌లో నేలకొన్న పరిస్థితులను చూడండి. ప్రతి రోజు వేల అనేక మంది కోవిడ్‌ బారిన పడుతుంటారు. ఇది అభూత కల్పన కాదు. ఇది దురదృష్టకర పరిస్థితి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చు’ అన్నారు. ఇక ఫౌసీ ట్రంప్‌ కార్యవర్గంతో కలిసి పని చేశారు. మాస్క్‌లు ధరిస్తే వైరస్‌ వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకోవచ్చని ముందు నుంచి చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్‌ మాత్రం ఈ సలహాలను పట్టించుకోలేదు. వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరినా ట్రంప్‌ వైఖరిలో మార్పు రాలేదు. ఇప్పటికి మాస్క్‌ ధరించడం లేదు.  దాంతో ట్రంప్‌ తీరుపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు