రెండో డోసు లేటైతే భారీగా యాంటీబాడీలు

22 May, 2021 05:15 IST|Sakshi

వాషింగ్టన్‌: వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఆలస్యం అయితే ఎక్కువ మేలు జరుగుతోందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని మయో క్లినిక్‌ వ్యాక్సిన్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ డైరెక్టర్, వైరాలజిస్ట్‌ గ్రెగొరీ పోలండ్‌ ఈ విషయాలను వెల్లడించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రెండో డోసుకు తీసుకునే కాలాన్ని పెంచడం ద్వారా యాంటీబాడీలు 20 శాతం నుంచి 300 శాతం ఎక్కువగా పెరుగుతాయని తేలిందని గ్రెగొరీ చెప్పారు. దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్లలో ఈ తరహా ఫలితాలే చూసినట్లు వెల్లడించారు. మొదటి డోసు వ్యాక్సిన్‌వేసిన వారికి రెండో డోసు వ్యాక్సినేషన్‌ కూడా కేటాయిస్తున్న నేపథ్యంలో చాలామందికి వ్యాక్సిన్‌ అందడం ఆలస్యమవుతోందని.. అయితే మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్‌ ఆలస్యం చేసి ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు