చిటికెడు మట్టి రూ.4 కోట్లు

18 Apr, 2022 04:32 IST|Sakshi

లండన్‌: అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే! ఆయన తనతో పాటు తెచ్చిన చంద్రుడి మృత్తికకు తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్‌ సంస్థ బొన్‌హామ్స్‌ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్ర మృత్తికను గుర్తు తెలియని వ్యక్తి 5,04, 375 డాలర్లు (సుమారు 3.85 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్‌ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది. 

మరిన్ని వార్తలు